రానున్న రోజుల్లో వారి సంఖ్య రెట్టింపు: నాగార్జున

14 Aug, 2020 08:26 IST|Sakshi
అక్కినేని నాగార్జునకు మొక్కను అందజేస్తున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను జయించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ప్లాస్మా దానంపై చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలపాలని కోరారు. ఇప్పటివరకు ప్లాస్మా దానం చేసిన వారిని గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం సన్మానించారు. (వాల్వ్‌ల్లేని ‘ఎన్‌–95’లే బెస్ట్‌)

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ప్లాస్మా దానం చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ముందుకు రావడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా సీపీ సజ్జనార్‌ చొరవ, కృషి అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేవారు దేవుళ్లతో సమానమని కొనియాడారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం చేయడం వల్ల 600 మంది ప్రాణాలు నిలపగలిగామని పేర్కొన్నారు. 

ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 90002 57058, 94906 17440లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు. (మాస్క్‌ ధరించలేదని ఫోన్‌ లాక్కొని..)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు