హైదరాబాద్‌లో త్రీడీ ఉత్పత్తుల తయారీ 

11 Feb, 2021 18:38 IST|Sakshi

అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

కేంద్ర ఐటీ శాఖ, ఎఎంఎస్‌ఐ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(ఏఎంఎస్‌ఐ).. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖతో కలసి హైదరాబాద్‌లో జాతీయ అడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ (ఎన్‌సీఏఎం)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంప్యూటర్‌ ఆధారిత డిజైన్ల ఆధారంగా భారీ స్థాయిలో వాణిజ్య పరంగా త్రీడీ ప్రింటింగ్‌ ఉత్పత్తులను తయారు చేయడాన్ని అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (ఏఎం)గా వ్యవహరి స్తున్నారు. 

హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఈ సెంటర్‌ ద్వారా జాతీయ స్థాయిలో అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రణాళికను అమలు చేస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ ఎమర్జింగ్‌ టెక్నాలజీ విభాగం ఇటీవల అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌కు సంబంధించి వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో స్టార్టప్‌లు, శిక్షణ సంస్థలు, అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు 40కి పైగా పాల్గొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏఎం పరిశ్రమను తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక, వ్యూహంపై ఇందులో చర్చించారు. 

దేశీయంగా ఏఎం పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశీయ మార్కెట్‌ విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, ఏఎం రంగం అభివృద్ధికి భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎన్‌సీఏఎం పనిచేస్తుందని వర్క్‌ షాప్‌ అభిప్రాయపడింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు అవసరమైన మౌలిక వసతులను హైదరాబాద్‌లో ఎన్‌సీఏ ఎంలో ఏర్పాటు చేస్తారు. అడిక్టివ్‌ మాన్యుఫాక్చరింగ్‌కు సంబంధించి ఆవిష్కరణ, పరిశోధన వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు.

చదవండి:
కేసీఆర్‌ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం

చైన్ కట్‌ చేయకుంటే జూన్‌లో మళ్లీ విజృంభణ

మరిన్ని వార్తలు