హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..

23 Nov, 2023 21:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై.. సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇక, నగరంలోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, మణికొండ, పంజాగుట్ల, బంజారాహిల్స్‌, గోషామహల్‌, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, హబీబ్‌నగర్‌, రాయదుర్గం, అప్జల్‌గంజ్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు