మహిళా ఐపీఎస్‌లకు సైబర్‌ స్టార్స్‌ అవార్డులు

7 Dec, 2021 04:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలకుగాను సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌)సంస్థ ప్రతీఏటా ప్రకటించే సైబర్‌ స్టార్స్‌ అవార్డులు రాష్ట్ర పోలీస్‌శాఖకు చెందిన ఇద్దరు మహిళా ఐపీఎస్‌ అధికారు లకు లభించాయి.

రెండు కీలక కేసుల్లో సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌ ద్వారా నిందితుల గుర్తింపునకు తీసుకున్న చర్యలకుగాను సీఐడీలో సీనియర్‌ ఎస్పీ (ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం) పరిమళ హనానూతన్‌కు అవార్డు లభించింది. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారికి చెక్‌ పెట్టడం, నిందితులను అరెస్ట్‌ చేయడం, వినూ త్న పద్ధతుల ద్వారా నిందితులను ట్రాక్‌ చేయడం, కేసుల పర్యవేక్షణకుగాను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీ (నేర విభాగం) రోహిణి ప్రియదర్శినికి అవార్డు దక్కింది. 
 

మరిన్ని వార్తలు