కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్‌ నటుడు విజయ్‌

18 May, 2022 19:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళ స్టార్‌ నటుడు విజయ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును కలిశారు. బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌కి వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారు విజయ్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌,  విజయ్‌ను సన్మానించారు.

ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీగానే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విజయ్‌ తాజా చిత్రం బీస్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదన్న విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్‌ ఎందుకు వచ్చారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు