Bandi Sanjay: ఈసారి కేసీఆర్‌ సెంటిమెంట్‌ వర్క్‌ ఔట్‌ కాదు

12 Dec, 2022 12:07 IST|Sakshi

సాక్షి, కోరుట్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కుట్రలను తెలంగాణ వాసులు గమనిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.  ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం జిగిత్యాల జిల్లాలో ఉన్న బండి సంజయ్‌.. కేసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఆయన మళ్లీ తెలంగాణలో సెంటిమెంట్‌ని రగిల్చి ప్రజల మనసు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

ఈ సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పోందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ తన  పాలనలో సాగించిన ఆగడాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు మీకు తగిన బుద్ధి చెబుతారంటూ విరుచుపడ్డారు. దేశంలో ఎక్కడ ఆరోపణలు వచ్చినా సీబీఐ వస్తుందన్న బండి సంజయ్‌.. లిక‍్కర్‌ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని కేసీఆర్‌ చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏ యాగం చేసినా ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌తో కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. అంతేగాదు జగిత్యాల పర్యటనలో ముందుగా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని డిమాండ్‌ చేశారు. 

(చదవండి: ముథోల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో బండి సంజయ్‌?)

మరిన్ని వార్తలు