‘తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా?’

20 May, 2022 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదన్న రీతిలో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కేంద్రం పల్లెలకు నేరుగా నిధులు ఇచ్చే విషయాన్ని చిల్లర వ్యవహారమని సీఎం అనడం దేనికి సంకేతమని ఆమె గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

ఆ వ్యాఖ్యలు చూస్తుంటే దొంగనే.. ‘దొంగా.. దొంగా..’అని అరిచినట్లు ఉందని, రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.     

మరిన్ని వార్తలు