Telangana: కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు తీపికబురు

18 Jun, 2021 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లగొండ: కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెగ్యులర్‌ ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా వారి వేతనాలు కూడా పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 320 మందికి వేతనాలు పెరగనున్నాయి. దీంతో వారంతా ఆనందంలో మునిగారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్‌ చేస్తూ జీఓ 16ను విడుదల చేసింది.

ఆ సమస్య కోర్టులో పడడంతో రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా మూల వేతనాన్ని కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇవ్వడంతో అప్పటివరకు రూ.18 వేలకు పనిచేసిన కాంట్రాక్ట్‌ అధ్యాపకుల వేతనం రూ.37,100కు పెరిగింది. దీంతో రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానమైన వేతనం పొందుతూ వచ్చారు. గురువారం ప్రభుత్వం 11వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచుతూ జీఓ105 ద్వారా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో ఉద్యోగికి ప్రస్తుతం వేతనం రూ.54,220కు పెరిగింది.  

చదవండి: తెలంగాణలోనూ నాడు-నేడు 

మరిన్ని వార్తలు