కాంగ్రెస్‌ గ్యారంటీల అమలు.. వైట్‌ రేషన్‌ కార్డు కీలకం!

24 Dec, 2023 20:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకు తంబ్‌ రూల్‌గా వైట్‌రేషన్‌(తెల్లరేషన్‌) కార్డును తీసుకోనున్నట్టు సమాచారం. దీనిపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 28వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన సభలను నిర్వహించనుంది. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే, ఈ పథకం లబ్ధి చేకూరలంటే రేషన్‌కార్డు తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వైట్‌ రేషన్‌ కార్డు లేకపోతే పథకం లబ్ధికి వారిని అనర్హుడిగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోనున్నట్టు సమాచారం. 

>
మరిన్ని వార్తలు