కేంద్రం రైడింగ్‌ల పేరుతో వేధింపులు: హరీశ్‌

8 Jun, 2022 01:53 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులకు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయనివ్వకుండా మిల్లర్లపై కేంద్రప్రభుత్వం రైడింగ్‌ పేరిట వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.

రైతులకు మేలు చేసే నాయకుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక్కరేనని, అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ధాన్యాన్ని తెచ్చి తెలంగాణలో కూడా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈనెల 12న గౌరవెల్లి రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవం చేయిస్తే ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఏం, స్టాఫ్‌ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3 వేల పారితోషికం అందిస్తామని చెప్పారు. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరలోనే 1,300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు