మహిళల సమస్యలపై ‘సాహస్‌’ అస్త్రం 

1 Dec, 2023 04:12 IST|Sakshi

పని ప్రదేశాల్లో భద్రతపై ప్రత్యేక యాప్‌ 

సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించిన మహిళా భద్రత విభాగం 

సాక్షి, హైదరాబాద్‌:  పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్‌’పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్‌లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్‌ హెల్ప్‌’ఆప్షన్‌ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

సాహస్‌ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్‌చేసి వివరాలు పొందవచ్చని వివరించారు.   

మరిన్ని వార్తలు