TS Assembly Sessions: వక్ఫ్‌బోర్డు భూములపై విచారణకు సిద్ధం: సీఎం కేసీఆర్‌ 

7 Oct, 2021 17:01 IST|Sakshi


‘‘వక్ఫ్‌బోర్డు భూములపై విచారణకు సిద్ధం. సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తాం. నగరంలో కొత్తగా 4 ఆస్పత్రులు నిర్మిస్తాం.. టిమ్స్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మరో 3 ఆస్పత్రుల నిర్మాణం కోసం స్థలం వెతుకుతున్నాం. గతంలో పంచాయతీలు ఎలా ఉండేవి. గ్రామాలు ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందాయో చూస్తున్నాం. గతంలో మంచినీరు, కరెంటు ఉండేది కాదు. ఇప్పుడు ఒక్కో వ్యక్తిపై రూ.669 ఖర్చు చేస్తున్నాం. గడ్డి అన్నారం మర్కెట్‌ స్థలంలో ఆస్పత్రి కట్టిస్తాం. స్థానిక సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల్లో విధిగా మొక్కలు పెంచాలి. మొక్కలు బతకకపోతే సర్పంచ్‌లను బాధ్యులను చేస్తామన్నాం’’ అని తెలిపారు కేసీఆర్‌. 

కేంద్రం పోస్టుమ్యాన్‌లా వ్యవహరిస్తుంది: సీఎం కేసీఆర్‌ 
► కేంద్రం మాత్రమే నిధులు ఇస్తుందనే భావన సరికాదని.. స్థానిక స్వపరిపాలన సవ్యంగా సాగాలని ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు కేటాయిస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం పోస్టుమ్యాన్‌లా మాత్రమే వ్యవహరిస్తుందని.. దేశాన్ని నడిపే క్రమంలో సిస్టమ్స్‌ ఉంటాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

► కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పల్లె ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారని, పల్లె ప్రగతి కనిపించడం లేదని విమర్శించారు. మొక్కలు పెంచడం... డంపింగ్‌ యార్డ్‌ల ద్వారా పల్లె ప్రగతి కనిపించదన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో  కొద్దిపాటి వరదలు రాగానే కార్లు, బైక్‌లే కాదు.. మనుషులే కొట్టుకుపోతున్నారన్నారు. మణికొండలో ఇటీవల ఓ వ్యక్తి కొట్టుకుపోయారని.. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని గొప్పగా చెబుతున్నారు.. పనులు చేయడం లేదని, నిధులు కేటాయించడం లేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

► అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గురువారం తెలంగాణ శాసనమండలి శుక్రవారానికి వాయిదా పడింది.

 ఉయభ సభల్లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విజయడైరీ ఉత్పత్తుల గిఫ్ట్ ప్యాక్‌లను అందజేశారు. మంగళవారం శాసనమండలిలో విజయడైరీపై ప్రశ్న సందర్భంగా.. విజయడైరీ ఉత్పత్తులను మంత్రి తలసాని సభకు తెలియజేశారు.

  ఈ ఏడాది విజయడైరీ ఉత్పత్తులను తమకు కూడా రుచి చూపించాలని సభ్యులు కోరారు. దీంతో సభ్యులందరికీ విజయడైరీ ఉత్పత్తుల ప్యాక్‌లను మంత్రి తలసాని అందజేశారు. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరోరోజు ప్రారంభమయ్యాయి. తొలత ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. తర్వాత ఇండియన్‌ స్టాంపు 2021 బిల్లును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు