కాంతమ్మకు అభి‘వంద’నం

9 Oct, 2020 08:57 IST|Sakshi

వందేళ్ల వయసులోనూ కోవిడ్‌ను జయించిన ధీశాలి

అపోలో వైద్యుల సమక్షంలో వందేళ్ల జన్మదిన వేడుక

అందరికీ ఆదర్శమంటూ ట్వీట్‌ చేసిన ఉపాసన కొణిదెల 

సాక్షి,హైదరాబాద్‌: అరవై ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలుండి కోవిడ్‌ వచ్చిన వా రు కోలుకోవడం కష్టమై చనిపోతున్నవారున్నారు. అయితే, రోగాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్న ఆత్మస్థైర్యం ఉంటే వందేళ్ల వయసులోనూ కోవిడ్‌ను జయించవచ్చని నిరూపిం చారు హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ డేవిడ్‌. 1920లో మద్రాసులో పుట్టిన లక్ష్మీకాంతమ్మ అక్కడే మెడిసిన్‌ను పూర్తి చేసి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వివిధ హోదాల్లో పనిచేశారు. నలభై ఏళ్ల క్రితం రిటైరయ్యారు. అప్పట్నుంచి ఇం టిపట్టునే ఉంటున్న ఆమెకు ఇటీవల దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది. కోవిడ్‌గా అనుమానిం చిన కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
(చదవండి: మిస్టర్‌ సీ.. జిమ్‌కి వచ్చేసీ...)

ఆమెకు షుగర్,బీపీతో పాటు కిడ్నీ తదితర వ్యాధులుండటంతో డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి ఆధ్వర్యం లోని వైద్యబృందం చికిత్స అందించారు. దీంతో ఆమె కోవిడ్‌ నుంచి క్షేమంగా బయటపడ్డారు. గురువారం ఆమెకు వందేళ్లు రావడంతో ఆమె జన్మదినాన్ని అపోలో వైద్యుల సమక్షంలో నిర్వహించారు. నూరేళ్ల వయసులోనూ కోవిడ్‌ను జయించి లక్ష్మీకాంత మ్మ ప్రేరణగా నిలిచారని, విధిరాతకంటే మ నోసంకల్పం గొప్పదని ఆమె ఆత్మస్థైర్యాన్ని వైద్యులు ప్రశంసించారు. ఆమె కుమారుడు డేవిడ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అమ్మకు మళ్లీ పునర్జన్మ వచ్చినట్లుగా నమ్ముతున్నామన్నారు. లక్ష్మీకాంతమ్మ రికవరీ అందరికీ ఆదర్శమని అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెల ట్వీట్‌ చేశారు.
(చదవండి: ఆరోగ్యంగా ఉందాం)

మరిన్ని వార్తలు