ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి

29 Jul, 2020 13:13 IST|Sakshi
భూదాన్‌ పోచంపల్లి : దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క

చౌటుప్పల్‌ (మునుగోడు) : కరోనా కష్టకాలంలో చేనేత కార్మి కులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని వీడాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావు డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలో చేనేత జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిబత్తిని ప్రభాకర్, పర్వతాల రాజిరెడ్డి, మాచర్ల కృష్ణ, జెళ్ల ఈశ్వరమ్మ, వర్కాల శ్రీమన్నారాయణ, కొలను మధుసూదన్, బోనగిరి కుమార్, పొట్టబత్తిని వాసుదేవ్, వర్కాల సూర్యనారాయణ జెళ్ల పాండు, కొలను సుధాకర్, రచ్చ ఉపేందర్, భీమనపల్లి నర్సింహ, పుష్పాల యాదయ్య, గుర్రం వెంకటేశం, శ్రీనివాస్‌ ఉన్నారు. 

చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : విమలక్క
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కరోనా వల్ల ఉపాధి లేక విలవిల్లాడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క అన్నారు. చేనేత సమస్యలను పరిష్కరించాలని 12 రోజులుగా మున్సిపల్‌ కేంద్రంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం సందర్శించి చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లయిన చేనేత వస్త్రాల కొనుగోలు, ఒక్కో కార్మికుడి కుటుంబానికి నెలకు రూ. 8వేల జీవనభృతి, కార్మికుడికి నేరుగా నూలుపై సబ్సిడీ, ప్రతి మగ్గానికి పెట్టుబడి సాయం కింద రూ.2 లక్షలు, మగ్గాలన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జేఏసీ కన్వీనర్‌ తడక రమేశ్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు శంకరయ్య, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు మంగళపల్లి శ్రీహరి, భారత వాసుదేవ్, కౌన్సిలర్‌ కొంగరి కృష్ణ, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి అంకం పాండు, చిక్క కృష్ణ, కర్నాటి పాండు, సూర్యప్రకాశ్, నాగేశ్, మిర్యాల వెంకటేశం, భాస్కర్, సంగెం చంద్రయ్య, రుద్ర నర్సింహ, వీరస్వామి, బాలయ్య, బాలరత్నం, శంకరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు