జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు: వైఎస్‌ షర్మిల

22 Aug, 2021 09:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్‌ షర్మిల, సోదరుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి  సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. హ్యాపీ రాఖీ’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు