వైఎస్సార్‌సీపీలో టీడీపీ నాయకుల చేరిక

27 Mar, 2023 01:32 IST|Sakshi

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌): తొట్టంబేడు మండలం, శివనాథపురం గ్రామానికి చెందిన 30 టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శివనాథపురం సర్పంచ్‌ ఎం.ఆర్‌.రాజా ప్రకాష్‌, మాజీ టీడీపీ నాయకులు ఉద్దండి ఆర్ముగం, పూడి హరియాదవ్‌, పూడి గోపాల్‌యాదవ్‌ ముత్తు, విజ్జి, మురుగన్‌, శరత్‌, ఏలుమలై, దినేష్‌, శరవణన్‌, రవీంద్రన్‌, ఈశ్వరన్‌, ప్రతిభన్‌, అన్నామలై, బాల, కృష్ణమూర్తి, ప్రతాప్‌, రాజలింగం, ప్రకాశం, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు