ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి

30 Mar, 2023 01:12 IST|Sakshi
జీ–20 పోస్టర్‌ను ప్రదర్శిస్తున్న జిల్లా అధికారులు

వైవీయూ : కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం జీ–20 జిల్లాస్థాయి నైబర్‌హుడ్‌ యూత్‌పార్లమెంట్‌ సమావేశం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా అగ్రికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.నాగేశ్వరరావు, మైనార్టీ సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వల్లూరు బ్రహ్మయ్య, సమగ్రశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎ. ప్రభాకర్‌రెడ్డి అతిథులుగా విచ్చేసి ఉపన్యసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు మాట్లాడుతూ మనదేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, యువశక్తి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు. దేశనిర్మాణంలో యువత భాగస్వాములు కావడం ద్వారా ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. అనంతరం స్వచ్ఛభారత్‌, బేటాబచాబో.. బేటీ పడావో.. ఉమెన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్‌ మణికంఠ మాట్లాడుతూ యువత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, దేశనిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అనంతరం పలు కేంద్రప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులు పలు అంశాలపై చర్చించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్‌లు అందజేశారు. కార్యక్రమంలో చిరుధాన్యాల గురించి నిపుణుడు రఘురామిరెడ్డి, కేతూరా, కళాశాల కరస్పాండెంట్‌ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్‌ శివవిష్ణుమోహన్‌రెడ్డి, స్టెప్‌ మేనేజర్‌ సుబ్బరాయుడు, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు నీలవేణి, శ్రావణి, సుబ్బనరసయ్య, అనంతలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.

యువతకు వక్తల పిలుపు

మరిన్ని వార్తలు