amp pages | Sakshi

162వ రోజు పాదయాత్ర డైరీ

Published on Wed, 05/16/2018 - 03:06

15–05–2018, మంగళవారం
జోగన్నపాలెం క్రాస్, పశ్చిమగోదావరి జిల్లా

పంచాయతీలు అవసాన దశలో ఉన్నాయంటే కారణం మీరు కాదా?
ఈ రోజు ఎదురైన ఓ సంఘటన.. బంధుత్వాలు లేకున్నా తమకంటూ ఓ నమ్మకాన్ని కలిగించిన మనిషి పట్ల బంధాలు, అనుబంధాలు ఎంత బలంగా పెనవేసుకుపోతాయో ప్రత్యక్షంగా అనుభవమైంది. ‘అయ్యా.. నా భర్త చావుబతుకుల్లో ఉన్నాడు. మంచినీళ్లు కూడా ముట్టకుండా నువ్వొస్తావని ఎదురుచూస్తున్నాడు’ అంటూ మనుమరాలిని వెంటతీసుకుని ఓ పెద్దమ్మ వచ్చింది. రోడ్డుకు దూరంగా వీధి చివర ఉన్న వారి ఇంట్లోకి అడుగుపెట్టగానే.. ఎదురుగా గోడ మీద కనిపించిన దృశ్యం కళ్లు విప్పారేలా చేసింది. దేవుళ్ల ఫొటోలతో సమానంగా వాటి మధ్య నాన్నగారి ఫొటోను పెట్టుకున్నారు. తమ గుండెల్లో వారు నాన్నగారికి ఇచ్చిన చోటు మనసును కదిలించింది.

చిక్కిశల్యమై మంచం పట్టిన ఆ ఇంటి పెద్దాయన కఠారి రాములును పరామర్శించాను. నన్ను చూడగానే కదిలిపోయిన ఆ పెద్దయ్య సంతోషంతో చేయి పట్టుకున్నాడు. ఆయనకు నాన్నగారంటే ఎంత ప్రేమంటే.. నాన్నగారి మరణవార్త వినగానే ఆ బాధను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మార్పణ చేసుకోవడానికి సైతం సిద్ధమైపోయాడట. అదృష్టవశాత్తు చుట్టుపక్కలవారు చూసి పక్కకు తప్పించి బతికించారట. ‘ఆరోగ్యం బాగోలేక ఆర్నెల్లుగా మంచానికే పరిమితమైన మా మావయ్య ముఖంలో ఈ రోజే ఆనందం చూస్తున్నామన్నా’ అంటూ ఆ ఇంటి కోడలు ఆప్యాయంగా చెప్పినప్పుడు మనసుకెంతో తృప్తినిచ్చింది. మరణించిన తర్వాత కూడా ఇలాంటి కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోవడంకన్నా సార్థకత ఏముంటుంది! 
 
‘అన్నా.. మా నాన్నకు 70 ఏళ్లు.. పింఛన్‌ రాలేదంటూ అర్జీ పెట్టుకున్నాను. కొద్ది రోజులకే ఓ ఫోన్‌ వచ్చింది. మీరు పింఛన్‌కు అప్లై చేశారట కదా.. గతంలో ఏ పార్టీకి ఓటేశారు.. అంటూ ఆరా తీశారు. జగనన్నకు అని చెప్పగానే.. వారానికే రేషన్‌కార్డు సైతం తీసేశారు. బతుకు భారంగా ఉంది.. పింఛన్‌ ఇవ్వండి మహా ప్రభో అని మొరపెట్టుకుంటే.. బియ్యం కూడా రాకుండా చేశారు. పంటికి మందు కోసం వెళితే కన్ను పీకేసినట్లైంది మా పరిస్థితి’ అంటూ బావురుమన్నాడు తిరుపతిరావు అనే సోదరుడు.  
 
‘అన్నా.. పేరుకే మేము సర్పంచులం.. కానీ పూర్తిగా ఉత్సవ విగ్రహాలం. చేతిలో ఏ పవరూ లేదు. పనులు చేస్తే బిల్లులూ రావు. ఒక్క పింఛన్‌ కూడా ఇప్పించలేని నిస్సహాయులం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నన్ను కలిసిన సర్పంచులు. ‘ఐదు నెలల నుంచి సిబ్బందికి జీతాల్లేవు. కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాయి మా గ్రామాలు’ అంటూ మైనర్‌ పంచాయతీల దయనీయ స్థితిని కళ్లకు కట్టారు. ఈ పాలనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కొసమెరుపేంటంటే.. ముఖ్యమంత్రిగారి తనయుడు ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారిపోవడం.  
 
రెండేళ్ల చంటిపాపను చంకనేసుకుని, ఆడబిడ్డను కాపాడండి.. అంటూ రాసిన ప్లకార్డు పట్టుకుని వచ్చింది.. పరంజ్యోతి అనే చెల్లెమ్మ. నేటి పాలనలో ఆడబిడ్డ తల్లుల అభద్రతాభావానికి, ఆందోళనకు అద్దంపడుతుందీ సన్నివేశం. 
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న..
పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేస్తామంటూ మేనిఫెస్టోలో గొప్పగా చెప్పారు. పంచాయతీల కాలపరిమితి ముగియనున్న ఈ దశలో కూడా సిబ్బందికి జీతాలు చెల్లించలేని, కరెంటు బిల్లులు కూడా కట్టలేని అవసాన దశలో ఉన్నాయంటే.. కారణం మీరు కాదా? రాజ్యాంగపరమైన అధికారాలను బదలాయిస్తామంటూ హామీ ఇచ్చి.. రాజ్యాంగేతర శక్తులైన జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టడం ద్రోహం కాదా?
- వైఎస్‌ జగన్‌

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)