వంతెన నిర్మాణానికి అధికారుల హామీ

Published on Wed, 09/03/2014 - 03:53

వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని  

తోట్లవల్లూరు : తోట్లవల్లూరు-పాములలంక మధ్య కృష్ణానదిపై  వంతెన నిర్మాణానికి  అధికారులు హామీ ఇచ్చారని  వైఎస్సార్‌సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తెలియజేశారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వంతెన నిర్మాణ ఆవశ్యకత గురించి ఇరిగేషన్ ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై సానుకూలంగా  స్పందించిన ఆయన వంతెన నిర్మాణానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు వచ్చాయని చెప్పారన్నారు. రూ.14 కోట్లకుపైగా వ్యయంతో  మరో మూడు నెలల్లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారని పద్మావతి తెలిపారు. వంతెన నిర్మాణంతో లంక గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ