చందనోత్సవంలో ‘చంద్రన్న’ భజన

Published on Wed, 05/08/2019 - 10:23

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న చందనోత్సవం భక్తజనకోటికి పర్వదినం. ఏడాదికోసారి అప్పన్న నిజరూపం.. భక్తులకు లభించే అపరూప దర్శనం.. అలాంటి ఆధ్యాత్మిక పండుగ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో మార్మోగాల్సిన సింహాచలం కొండపై అడుగడుగునా అధికార పార్టీ బ్యానర్లు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వేళ.. సింహాచలం కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తిస్తూ వెలిసిన బ్యానర్లను చూసి భక్తులు అవాక్కయ్యారు. క్యూలైన్లతో పాటు సింహాచలం కొండపై అడుగడుగునా వేద ధర్మరక్షణ సభ పేరిట ఏర్పాటుచేసిన ఈ బ్యానర్లలో నదుల అనుసంధానం.. నరులు అందరికి ఆనందం.. పట్టిసీమతో ప్రారంభం... పోలవరంతో పరిపూర్ణం.. అన్ని నదులకు జలహారతులు.. అన్నదాతలకు ఆత్మానందస్మృతులు..జీడీపీలో ఆంధ్రప్రదేశ్‌ ముందు.. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ ముందు అందుకే చంద్రన్నా మీరు అసలైన భగీరథులు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తిస్తూ వెలసిన బ్యానర్లుపెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

సింహాచలం కొండపై ఎటువంటి రాజకీయ ప్రచారం చేయకూడదు. రాజకీయ బ్యానర్లు, పార్టీ ప్రచారాలు చేయకూడదు. పైగా కోడ్‌ వేళ ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. అలాంటి సింహాద్రి అప్పన్నను కీర్తించే చోట చంద్రన్నను కీర్తిస్తూ వెలిసిన బ్యానర్ల వెనుక సింహాచలం దేవస్థానం అధికారులున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారుల అండదండలతోనే వేద ధర్మ రక్షణ సభ పేరిట టీడీపీ నేతలు ఈ బ్యానర్లు ఏర్పాటుచేశారని చెబుతున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో ఆధ్యాత్మికంగా నిర్వహించిన చందనోత్సవంలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నించింది. అధికార పార్టీ విపరీత చర్యలను వీహెచ్‌పీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎవరైతే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నేత పూడిపెద్ది శర్మ డిమాండ్‌ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ