amp pages | Sakshi

కౌలు రైతులకూ పంట రుణాలు

Published on Thu, 07/16/2020 - 03:20

సాక్షి, అమరావతి: రైతులకు అన్నివిధాలా అండదండలు అందిస్తూనే.. కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పంట రుణాల పక్షోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే..

రైతుల హక్కులకు భంగం కలగదు: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
► వ్యవసాయ రంగం అభివృద్ధిపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు.
► రైతులతో పాటు కౌలుదారులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో నూతన సాగుదారుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
► ఈ చట్టం వల్ల భూ యజమానులైన రైతుల హక్కులకు ఎటువంటి భంగం కలగదు. 
► 11 నెలల సాగు అనంతరం కౌలు హక్కులు వీడిపోయేలా చట్టం రూపొందించాం.
► కౌలుదారుల వివరాలను అధికారులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతులపై ఉంది.
► కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే పంట రుణాలిస్తోంది. ఏపీలో రైతులతో పాటు కౌలుదారులకూ రుణాలు అందించాలని సీఎం నిర్ణయించారు.

కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు : కురసాల కన్నబాబు
► రుణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు అందిస్తాం.
► రాష్ట్రంలో ఇప్పటివరకు 4,02,229 మందికి సీసీఆర్సీ కార్డులు అందజేశాం. మరో లక్షన్నర వరకూ కార్డులు అందిస్తాం. రూ.8,500 కోట్లను కౌలుదారులకు పంట రుణాలుగా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు.
► త్వరలో జిల్లాలు, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అభ్యుదయ రైతు అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బోర్డులు పంటల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయి. 
► రైతులకు వడ్డీ లేని రుణ బకాయిల కింద రూ.1,150 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. 
► ఈ విషయంలో బ్యాంకర్లు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.

రూ.200 కోట్లతో పొగాకు కొనుగోళ్లు
► పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అన్ని ప్లాట్‌ఫారాల్లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
► రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 55.5 శాతం అధికంగా కురవటం శుభసూచకం. ఖరీఫ్‌ పనులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే 32 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. 
► సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది మే నాటికే 12.61 లక్షల మంది రైతులకు 8.43 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందజేశాం. ఇప్పటికే రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందజేశాం.
► ప్రస్తుత వర్షాల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల నారుమడులు ముంపునకు గురైనట్టు సమాచారం అందుతోంది. వివరాలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించాం. సంబంధిత రైతులను ఆదుకుంటాం. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)