6 జిల్లాల్లో కరువు- హోంమంత్రి

Published on Thu, 08/13/2015 - 12:48

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో 6 జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆ రాష్ట్ర హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. కరువు నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఈసారి 98 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారన్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి పరిస్థితి జటిలంగా మారిందన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎం. జానకి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ