ఓటర్‌ లిస్టులో పేరుందా? మీరూ చెక్‌ చెసుకోండి

Published on Sun, 03/10/2019 - 14:41

 -నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

 -1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 

- www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

-జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ 9491602905

-జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు.

-మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  

-గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు.

-సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ