amp pages | Sakshi

బిల్లు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం :జూడాలు

Published on Thu, 08/08/2019 - 12:04

సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడ బిఆర్టీఎస్‌ రోడ్డులో జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ చేపట్టారు.ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) పిలుపు మేరకు నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుప్రతుల్లో గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేవిధంగా ఎన్‌ఎంసీ బిల్లు ఉందని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో 50 శాతం సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

బిల్లులోని లోపాలను సవరించాలి: 
నెల్లూరు: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ నగరంలోని కలెక్టరేట్‌ ముందు జూనియర్‌ డాక్టర్లు ధర్నానిర్వహించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఎన్‌ఎంసీ బిల్లులోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

తిరుపతి రుయా ఆసుప్రతిలో రోగుల పడిగాపులు:
తిరుపతి: ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యులు సమ్మె చేపట్టడంతో తిరుపతి రుయా ఆసుప్రతిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. బిల్లును వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్‌ చేశారు. గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లతో పాటు ప్రవేట్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. గురువారం వైద్య సేవలను నిలిపి వేశారు. జూడాలు సమ్మెకు దిగడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్‌  ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. ఆర్థిక స్తోమత లేనివారు ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు కేంద్రానికి వ్యతిరేకంగా జూడాలు తమ నిరసన కొనసాగిస్తున్నారు
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)