బాబు బెదిరింపులపై ఐఏఎస్‌ అధికారుల ఆగ్రహం

Published on Mon, 05/06/2019 - 15:48

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులపై ఐఏఎస్‌ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. నిన్న రాత్రి విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు సీనియర్‌ అధికారులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు బెదిరింపుల వ్యవహారంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.



ఏపీ సీఈఓ గోపాల ద్వివేదీని బెదిరించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినేట్‌కి రాకపోతే అధికారుల సంగతి చూస్తానన్న బాబు బెదిరింపులపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై నిరసనగా అధికారులు కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల్లో మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేబినేట్‌ మీటింగ్‌ పెడితే కార్యాచరణ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ