నాలుగేళ్లుగా కలుషిత నీరు తాగుతున్నాం

Published on Fri, 05/25/2018 - 06:54

పశ్చిమగోదావరి : అన్నా జగనన్న మాది కోలమూరు. మా గ్రామంలో నాలుగేళ్లుగా చెరుకురసం మాదిరిగా ఉన్న కలుషిత నీరు తాగి నానా ఇబ్బందులు పడుతున్నామని అదే గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని పన్నాసి ధనలక్ష్మి ఆద్వర్యంలో మహిళలు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పైపులైన్‌ ద్వారా ఇస్తున్న నీరు కూడా శుభ్రంగా ఉండటం లేదని చెప్పారు. మీరు అధికారంలోకి రాగానే మా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు వేడుకున్నారు.

జగన్‌బాబు.. చల్లగా ఉండు
ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఆరేడు సమీపంలో ఆటోలో వెళ్తున్న వృద్ధురాలు బాబు జగన్‌బాబు అంటూ ఆప్యాయంగా పిలిచింది. వెంటనే అంతమంది జనం ఉన్నా జగన్‌మోహన్‌రెడ్డి చెలిమి కోటమ్మ అనే వృద్ధురాలి వద్దకువెళ్లి అవ్వ ఎలా ఉన్నావు అని అడిగారు. బాబు నేను బాగున్నాను. మీరు చల్లగా ఉండాలి అని ఆ వృద్ధురాలు జగన్‌మోహన్‌రెడ్డిని దీవించింది.-

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ