పొక్లయిన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published on Wed, 01/08/2014 - 04:12

 అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్:
 ఆగిన పొక్లయిన్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యా యి. పోలీసుల కథనం ప్రకారం రాజమండ్రి ఆర్టీసీ డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్ 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి బయల్దేరింది. జాతీయ రహదారిని ఆనుకున్న కొప్పాక గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో పూడిక తీసేందుకు ట్రాలర్‌పై పొక్లయిన్‌ను సోమవారం రాత్రి తీసుకొచ్చి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారి రోడ్డు పక్కన నిలిపారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్ ఆగిన పొక్లయిన్ బెల్టును ఢీకొంది. దీంతో బస్సుకు ఎడమ వైపు సీట్లను ఆనుకున్న రేకు పూర్తిగా ఊడిపోయింది. ఆ వైపు కూర్చున్న విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన పి.శ్రీదేవి (40), అక్కయ్యపాలెంకు చెందిన ఎ.సత్యనారాయణ (42), మచిలీపట్నానికి చెందిన కె.రమేష్‌బాబు (47) తీవ్రంగా గాయపడ్డారు.
 
  ఆర్టీసీ డిపో మేనేజర్ ఉదయశ్రీ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గణేష్, అసిస్టెంట్ మెకానిక్ మోహన్‌రావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన ప్రత్యేక వాహనంలో విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రయివర్ సిహెచ్.నారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ