amp pages | Sakshi

శంకుస్థాపనకే నీలిట్ ప్రాజెక్టు పరిమితం

Published on Thu, 01/21/2016 - 03:39

 ఎచ్చెర్ల: నీలిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆన్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు  2013 ఏప్రిల్‌లో టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం తర్లికొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి హాదాలో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో స్థలం కొరత, మరో పక్క శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి దగ్గరగా లేకపోవడంతో మరో ప్రాంతం ఎంచు కోవాలని భావించారు. సరిగ్గా సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ ముందు 2014 ఫిబ్రవరి 28న కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నీలిట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
 
 యూపీఏ ప్రభుత్వ సమయంలో ఈ రెండు శంకుస్థాపనలు జరిగాయి. అనంతరం ఎన్నికల్లో  రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. దీంతో నీలిట్ ప్రాజెక్టు తెరమరుగయ్యింది. ప్రస్తుతం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శిలాఫలకం వెక్కిరిస్తోంది. దేశంలో నీలిట్ ప్రాజెక్టులు 23 ఉన్నాయని, 24వ ప్రాజెక్టు నిర్మాణం జిల్లాకు గర్వకారణంగా అప్పట్లో నేతలు, అధికారులు చెప్పుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.50 కోట్లలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
 
 10వ తరగతి, ఆపై చదువులు చదివిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పి ంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగ పడడంతో పాటు, ఉపాధికి సైతం దోహద పడేది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం తెరమరుగయ్యింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అశించిన యువకులకు నిరాశే మిగిలింది. మరో పక్క ఉన్నత స్థాయి వ్యక్తులు శంకు స్థానలు చేశాక ప్రాజెక్టులు కూడా నిలిచిపోతాయా అన్న అంశం సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులు శాశ్వితం కావా అన్నది మరికొందరి వాదన.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)