ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

Published on Sun, 04/08/2018 - 10:41

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘ప్రత్యేక హోదా –ఆంధ్రుల హక్కు, హోదాతోనే రాష్ట్ర భవిత ముడిపడి ఉంది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కుని సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రత్యేక హోదా సాధించటమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాట ఎజెండాను ఎంచుకుందని’ ఆ పార్టీ శ్రేణులు సృష్టం చేశాయి. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిరళంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని నేతలు ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో శనివారం నుంచి రిలే నిరహర దీక్షలు ప్రారంభించారు. మరోవైపు జిల్లాకు చెందిన నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు మేకపాటి  రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురి కావటంతో జిల్లాలో సర్వత్రా అందోళన వ్యక్తం అవుతుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే నిరహర దీక్షలు నిర్వహించారు. 

ఢిల్లీ దీక్షల్లో జిల్లా ఎమ్మెల్యేలు 
ఢిల్లీలో జరుగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ఆమరణ దీక్షల్లో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనిల్‌ కుమార్, నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖరరెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు పలువురు ఢిల్లీలో ఉన్నారు. 

జిల్లాలో రిలే దీక్షలు ప్రారంభం 
సర్వేపల్లి నియోజక వర్గంలోని వెంకటాచలం మండలంలో నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజకీయ జోకర్‌లా మారి రోజుకోరకంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.

కోవూరు నియోజకవర్గంలోని కోవూరులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి  విద్యార్థులతో కలిసి రిలేదీక్షలు ప్రారంభించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్‌ కోసం తమ పార్టీ ఎంపీలు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా హోదా కోసం అమరణ దీక్షలు చేపట్టారని చెప్పారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆడుగుజాడల్లో రాష్ట్రానికి హోదా సాధన కోసం ముందుకు పోతామన్నారు.

గూడూరు నియోజకవర్గంలోని గూడురులో నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి ఆధ్వర్యంలో రిలే నిరహర దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. మేరిగ మురళి మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి హోదా కోసం పోరాడుతుంటే టీడీపీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ వద్ద డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో, తమ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతామన్నారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు గంధం సుధీర్‌బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌ పాల్గొన్నారు. 

నెల్లూరు రూరల్‌ పరిధిలోని కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతంలో పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ మేఘనాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు వంటి నీచమైన వ్యక్తి చేస్తున్న స్వార్థ రాజకీయాలు చూస్తున్న ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేట బస్టాండ్‌ సెంటర్‌లో రిలేదీక్షలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్యర్యంలో జరిగిన రిలే దీక్షల్లో అన్ని మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పార్టీ పిలుపు మేరకు ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

వెంకటగిరిలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరీషా ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. శిరీషా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు దీక్ష చేస్తున్నారని, అందుకు అందరం సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఉదయగిరిలో పార్టీ మండల కార్యదర్శి గొల్లపల్లి తిరుపత య్య, కో ఆప్షన్‌ సభ్యుడు  షంషీర్‌  రిలేదీక్షలు చేపట్టారు.

ఆత్మకూరులో పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి, ఏఎస్‌పేట మండల కన్వీనర్‌ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, అన్ని మండలాల పార్టీ కన్వీనరల  ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు.

కావలిలో పార్టీ బోగోలు మండల అధ్యక్షుడు మద్దిబోయిన వీరరఘయాదవ్, కావలి 23వ వార్డు కౌన్సిలర్‌ కనుపర్తి రాజశేఖర్, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)