amp pages | Sakshi

గొడవ చేస్తే రుణాలు రద్దు కావు

Published on Fri, 08/08/2014 - 00:41

  •       ముఖ్యమంత్రి సభలో బుద్దిగా కూర్చోండి
  •      డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరిక
  • యలమంచిలి, నాతవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్పేది వినండి.. సభలో గొడవ చేశారో? మీ గ్రూపులకు డ్వాక్రా రుణాల రద్దు వర్తించదు. డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరికలివి. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా జిల్లాలో చంద్రబాబు పర్యటన సభ నిర్వహణకు అధికారులు పోటీ పడుతున్నారు. సభ విజయానికి కొన్ని రోజులుగా రేయింబవళ్లూ శ్రమిస్తున్న అధికారులు సభలో మహిళలు మౌనంగా ఉండాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది.
         
    నక్కపల్లి సభకు దాదాపు 30 వేల మంది మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని అధికారం చేపట్టిన చంద్రబాబు గ్రూపుకు రూ.లక్ష మాఫీ హామీ మహిళలను ఏమాత్రం సంతృప్తిపరచడం లేదు. మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద తమ గోడును వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభలో మహిళలు ఆందోళనకు దిగితే చంద్రబాబు ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎంత వారించినా మహిళలు మాత్రం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్న డిమాండ్‌తోనే సభలకు హాజరవుతున్నారని తెలిసింది.
     
    తాళం వేసే వారినే తరలించండి

    ముఖ్యమంత్రి సభల్లో మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు అధికంగా రైతులు, డ్వాక్రా మహిళలను అధిక సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అన్ని మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. నాతవరం మండలానికి ప్రత్యేకాధికారిగా నియమితులైన డీఆర్‌డీఏ ఏపీఎం కనక దుర్గ గురువారం ఐకేపీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య డ్వాక్రా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.

    ఆ సమావేశానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న మహిళలను మాత్రమే తరలించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసే వారిని సమావేశాలకు తీసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండలం నుంచి ఈనెల 9న నక్కపల్లి ప్రాంతంలో జరిగే ముఖ్యమంత్రి సభకు 25 బస్సుల్లో సుమారుగా వెయ్యి మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఐకేపీ ఏపీఎం శివ ప్రసాద్‌ను అదేశించారు.
     

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)