amp pages | Sakshi

ఇక పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టమ్

Published on Sun, 02/15/2015 - 02:21

విద్యార్థుల ఆధార్‌తో అనుసంధానం
మొదటి విడతలో ఐదు జిల్లాల ఎంపిక
అందులో ఒకటి చిత్తూరు


చిత్తూరు: అన్ని ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలు,కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వర్లతో వీటిని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా పాఠశాలలకు చెందిన మొత్తం సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి బయోమెట్రిక్ పరికరాలను అమరుస్తారు. 200 మంది లోపు విద్యార్థులకు ఒకటి చొప్పున ఈ పరికరాలను అమర్చనున్నారు. ఇందుకోసం మొదటి విడతలో చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరుతోపాటు మొత్తం ఐదు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో తొలుత బయోమెట్రిక్ విధానానికి ఆధార్ అనుసంధానం పూర్తిచేసి దీన్ని అమలుచేయనున్నారు. తరువాత మిగిలిన జిల్లాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తారు.

ఈ విధానంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాలలకు మంజూరవుతున్న నిధులు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, చదువు మానేసిన సమాచారంతోపాటు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వివరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఆధార్‌కార్డు నంబర్ సేకరణ ప్రక్రియ చాలా రోజుల  క్రితమే ప్రారంభమైంది. విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5,98,676 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత చదువులకు సంబంధించి విద్యార్థులను కలిపితే 10లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు.  ఇప్పటివరకు జిల్లాలో 97 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఆధార్ అనుసంధానం పూర్తిచేసి బయోమెట్రిక్ అమలు చేయనున్నారు.
 
 

Videos

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)