సీఎం సిగ్గుతో తలదించుకోవాలి

Published on Fri, 01/19/2018 - 02:48

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే మహిళలకు రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లి గ్రామంలో ఒక మహిళను అమానుషంగా వివస్త్రను చేసి టీడీపీ నేతల అండతో దాడి చేసిన ఘటనపై చంద్రబాబు, ఆయన కుటుంబీకులు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆ ఘటనను టీడీపీ నేతలు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి పైశాచికానందాన్ని పొందుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రితో పాటు అందరూ సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం  ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఇద్దరు దంపతులను పక్కన ఉన్న మహిళ దుర్భాషలాడడం, తర్వాత వారిపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రోద్బలం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి, నోటితో కొరికి దారుణంగా దాడి చేశారని మండిపడ్డారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ