వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన విజయభాస్కర్‌ రెడ్డి

Published on Tue, 01/24/2017 - 13:57

హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. ప్రజల వెంట నడుస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పలువురు నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ స్వభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.

ఇక, మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌ కూడా వైఎస్సార్‌సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ