amp pages | Sakshi

మీ ఓటు లేకపోతే.. దరఖాస్తు చేసుకోండిలా!

Published on Tue, 03/12/2019 - 18:25

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళా.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ‘సాక్షి’ నడుం బిగించింది. తెలంగాణ, ఏపీలోని లోక్‌సభ స్థానాలతోపాటు.. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోనివారు, ఓటరు జాబితాలో తమ పేరు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఐదు రోజు సమయం ఇచ్చింది. ఈ గడువు మార్చి 15 వ తేదీతో ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యత తెలిపేలా సాక్షి ప్రచారం కల్పిస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఓటు కోసం నమోదు చేసుకునేవారికి ఆ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఓ వీడియోను రూపొందించింది. 

ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే...
ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకోవడానికి తొలుత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ www.nvsp.in ఓపెన్‌ చేయాలి. అందులో ఫాం 6ను ఓపెన్‌ చేసి సంబంధిత భాషను ఎంచుకోవాలి. తర్వాత మీ రాష్ట్రం, మీ జిల్లా, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. తదుపరి మీ పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు/భర్తపేరు(వారి ఇంటి పేరు కూడా) ఎంటర్‌ చేయండి. తదుపరి పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలు నింపాలి. ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్న చిరునామా, మీ శాశ్వత చిరునామాను దరఖాస్తులో పేర్కొనాలి. మీ కుటుంబ సభ్యుల లేదా మీ ఇంటి పక్కన ఉన్నవారి ఓటరు కార్డుపై ఉండే ఎపిక్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి. 

తదుపరి మీ ఫొటో, వయస్సు ధ్రువీకరణ, అడ్రస్‌ ప్రూఫ్‌ డ్యాకుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి. మీ ఊరు, మీ రాష్ట్రం, మీ జిల్లా సెలక్ట్‌ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తున్నారో తెలుపండి. చివరిగా క్యాప్చాలో చూపిన అక్షరాలను/నంబర్‌లను ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయండి. ఆ తర్వాత వెంటనే స్క్రిన్‌పై మీకు ఒక రిఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది. మీరు ఆ నంబర్‌ సహాయంతో మీ దరఖాస్తు పురోగతిని ట్రాక్‌ చేసుకోవచ్చు. 

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మన హక్కు.. దానిని వినియోగించుకోవడమంటే మన తలరాతను మనమే రాసుకోవడం.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)