సచివాలయ కంప్యూటర్లపై వాన్నా క్రై దాడి!

Published on Thu, 05/18/2017 - 00:32

 అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లను స్తంభింపజేసిన వాన్నా క్రై ర్యాన్‌సమ్‌వేర్‌.. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని పలు కంప్యూటర్లనూ తాకినట్లు అనుమానిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని డిప్యూటీ కార్యదర్శి ఒకరు బుధవారం తన కంప్యూటర్‌ను ఓపెన్‌ చేసిన సమయంలో ఈ వైరస్‌ దాడి వెలుగుచూసింది. తన కంప్యూటర్‌ ఓపెన్‌ కాకపోవడంతో వెంటనే ఐటీ అధికారులను పిలిచానని, వైరస్‌ దాడి జరిగినట్లు ఈ సందర్భంగా గుర్తించామని ఆ అధికారి వివరించారు.

రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరో 9 కంప్యూటర్లలోనూ ఇదే సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అయితే  సచివాలయంలో ఏ ఒక్క కంప్యూటరూ ర్యాన్‌సమ్‌వేర్‌ బారిన పడలేదని ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ 9 కంప్యూటర్లలోని హార్డ్‌ డిస్క్‌లను తొలగించినట్లు చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ