ఈ ఐటీ జాబ్స్‌ త్వరలో కనుమరుగు

Published on Fri, 08/04/2017 - 13:48

ఆటోమేషన్‌ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే తగలబోతుంది. ఆటోమేషన్‌ ముప్పు, కొత్త డిజిటల్‌ టెక్నాలజీలోకి మరలే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటూ పోతున్నాయి. అంతేకాక కొత్త నియామకాల జోరునూ తగ్గించి, ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు చెందిన బిజినెస్‌ అడ్వయిజరీ సంస్థ హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌ అంచనాల ప్రకారం ఆటోమేషన్‌ ప్రభావంతో దేశీయ ఐటీ వర్క్‌ఫోర్స్‌ 14 శాతం తగ్గిపోనుందని తెలిపింది. అంటే 2021 వరకు నలభై లక్షల మంది ఉద్యోగులు ప్రమాదంలో పడబోతున్నారట.  
 
అదేవిధంగా బీపీఓ రంగంలోని సంప్రదాయబద్ధమైన హ్యుమన్‌ రోల్స్‌, అన్ని ఐటీ ఉద్యోగాలకు సమానం ఉండవని, ఆటోమేషన్‌ ప్రభావంతో ఇతర రంగాలతో పోలిస్తే సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ఎక్కువ ప్రభావితం కానుందని రీసెర్చ్‌ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాక కొన్ని ఐటీ ఉద్యోగాలు ఇక మనకు కనిపించకుండా కూడా పోతాయని తెలుస్తోంది. 
 
ఆన్‌లైన్‌ ప్రొఫిషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ సింప్లిలెర్న్‌ రీసెర్చ్‌ రిపోర్టు ప్రకారం వచ్చే ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు భారీగా పడిపోతున్నాయట. అవి ఏమిటో ఓసారి చూద్దాం..
మాన్యువల్‌ టెస్టింగ్‌: దీనిలో సాఫ్ట్‌వేర్‌ టెస్ట్‌ ఇంజనీర్‌, క్యూఏ ఇంజనీర్‌, మాన్యువల్‌ టెస్టర్‌ ప్రభావితం ​కానున్నాయి.   
ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ మేనేజ్‌మెంట్‌ : సిస్టమ్‌ ఇంజనీర్‌, ఐటీ ఆపరేషన్స్‌ మేనేజర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌
బీపీఓ : డేటా ఎంట్రీ ఆపరేటర్‌, కస్టమర్‌ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ సపోర్టు
సిస్టమ్‌ మైంటెనెన్స్‌ : సర్వర్‌ మైంటెనెన్స్‌, మైంటెనెన్స్‌ ఇంజనీర్‌
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ