amp pages | Sakshi

వంటింటికి మరింత వన్నె

Published on Sat, 02/14/2015 - 05:48

మాడ్యులర్ కిచెన్స్‌పై పెరుగుతున్న ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఓ భాగమే కిచెన్ డిజైనింగ్. రానురానూ దీనికి ఆదరణ పెరిగి మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ అనే ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది. ఒక మాదిరి కుటుంబ స్థాయి ఉన్నవారెవరైనా ఇంట్లో వంట కోసం ఓ ప్రత్యేక గదిని కేటాయిస్తున్నారు.
 
మాడ్యులర్ కిచెన్ అంటే..
వంటింట్లోని సామగ్రి బయటకు కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా తీర్చిదిద్దడమే మాడ్యులర్ కిచెన్. ఇల్లు పాతదైనా.. కొత్తదైనా.. వంట గదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతో పాటు అవసరమైనప్పుడు తెరచుకునేలా, కావాల్సిన వైపుకు తిప్పుకునేలా మాడ్యులర్ కిచెన్‌లో ర్యాకులుంటాయి.
 
బడ్జెట్‌ను బట్టి: ఇందుకోసం ముందుగా తయారీ విడి భాగాలతో ఒక నమూనా తయారు చేస్తారు. కేటాయించిన స్థలం, ఖాతాదారుడి బడ్జెట్‌పై వీటి తయారీ ఆధారపడి ఉంటుంది. వంటగదికి కేటాయించిన స్థలాన్ని అంచనావేసి, దానికి అనుగుణంగా విడిభాగాలను సేకరించి వంటగదిలో అమర్చుతారు. తక్కువ స్థలంలో ఇముడుతూ, ఎక్కువ అందంగా వంటగది కనిపించేలా చూడటమే డిజైనర్ పని.
 
రూ.10 వేల నుంచి మొదలు: మన ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగానే మాడ్యులర్ కిచెన్స్‌లోనూ పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటింట్లోని సామగ్రి బయటకు కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా రూపుదిద్దుతున్నారు. వీటి ధరలు రూ.10ల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాడ్యులర్ కిచెన్స్ నుంచి పొగ బయటకు రాదు. పాతకాలంలో పొయ్యి మీద పొగ గొట్టాలున్నట్లుగానే ఉంటాయి. కానీ ఇవి అధునాతనంగా ఉంటాయి. దీంతో పాటు వంట సామాగ్రి  చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. లిమెన్స్ కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల పేర్లతో మన అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక అరలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును మోసేలా ఉంటుంది. వీటికి వేడి తగిలినా.. నీటిలో తడిచినా ఏమాత్రం చెక్కుచెదరవు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌