హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 20% అప్‌

Published on Sat, 07/18/2020 - 14:19

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6,659 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 18 శాతం పెరిగి రూ. 15,665 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్‌ ఫలితాలివి. ఈ కాలంలో రుణ మంజూరీ 21 శాతం పుంజుకోగా, డిపాజిట్లు 25 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 49 శాతం పెరిగి రూ. 3891 కోట్లను దాటాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో ఫ్లోటింగ్‌ ప్రొవిజన్లకు రూ. 1451 కోట్లు, కంటింజెన్సీలకు రూ. 4002 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.  ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం 15 శాతం బలపడి రూ. 12,829 కోట్లను తాకింది. నిర్వహణ వ్యయాలు 2.9 శాతం తగ్గి రూ. 7117 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంక్‌ తెలియజేసింది. 

ఎన్‌పీఏలు అప్
క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ఆర్థిక మందగమనం కారణంగా రిటైల్‌ రుణాలు, థర్డ్‌పార్టీ ప్రొడక్టుల విక్రయాలు, క్రెడిట్‌ కార్డుల వినియోగం నీరసించినట్లు బ్యాంక్‌ పేర్కొంది. దీంతో ఫీజు ఆధారిత ఆదాయం సుమారు రూ. 2000 కోట్లు తగ్గినట్లు తెలియజేసింది. కాగా.. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 1103 వద్ద ముగసింది. ఇంట్రాడేలో రూ. 1104 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1058 వద్ద కనిష్టానికీ చేరింది. ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో ప్రతిఫలించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ