రూ.1,177కే విమాన టిక్కెట్‌

Published on Fri, 06/15/2018 - 15:12

న్యూఢిల్లీ : ఉడాన్‌ స్కీమ్‌ కింద జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ విమాన టిక్కెట్లను చౌక ధరలో అందిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో విమాన టిక్కెట్లను రూ.1,177కే అందించనున్నట్టు పేర్కొంది.  ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌, విమానాలను ఇతర పెద్ద గమ్యస్థానాలతో పాటు ప్రాంతీయ ప్రాంతాలకు కనెక్ట్‌ చేస్తోంది. తాజాగా లాంచ్‌ చేసిన మార్గాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రభుత్వ రీజనల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ లేదా ఆర్‌సీఎస్‌ కింద ప్రారంభించింది. సాధారణ వ్యక్తులకు కూడా విమాన ప్రయాణాన్ని చౌక ధరకు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉడాన్‌-ఆర్‌సీఎస్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఆర్‌సీఎస్‌ రూట్లలో తన నెట్‌వర్క్‌పై పలు ఇతర మార్గాలతో అలహాబాద్‌ను కనెక్ట్‌ చేస్తోందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.  

కొత్త విమానాలను అలహాబాద్‌ నుంచి ముంబైకు టూ-వే కనెక్షన్లలో వయా నాగ్‌పూర్‌, ఇండోర్‌, లక్నో మార్గాల ద్వారా ఆఫర్ చేయనున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా టూ-వే కనెక్షన్లలోనే వయా ఇండోర్, పాట్నా ద్వారా అలహాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానాలను ఆఫర్‌ చేస్తోంది. వయా ఇండోర్‌ మార్గాన అలహాబాద్‌ నుంచి పుణేను కనెక్ట్‌ చేసుకునే అవకాశం కూడా సందర్శకులకు కల్పిస్తోంది. అదేవిధంగా వయా లక్నో రూట్‌లో అలహాబాద్‌ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణే, జైపూర్‌, అబుదాబిలకు విమానాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ కనెక్ట్‌ చేస్తోంది.    

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ