ఫ్రైడే బ్లడ్‌ బాత్‌, లాభపడిన షేరు ఒక్కటే

Published on Fri, 02/28/2020 - 15:54

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను మూట గట్టుకున్నాయి. కోవిడ్‌-19 (కరోనావైరస్) భయాలతో అమెరికా మార్కెట్లు  తొమ్మిది సంవత్సరాల కనిష్టానికి చేరగా, దేశీయంగా బెంచ్‌మార్క్ సూచికలు సెన్సెక్స్ ,  నిఫ్టీ శుక్రవారం భారీగా కుప్పకూలిపోయాయి వారమంతా నష్టాల్లోనే  కొనసాగిన కీలక సూచీలు వరుసగా ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోతూ వచ్చాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీగా నష్టపోయిన వారం ఇదేనని చెప్పొచ్చు. 

ఇంట్రాడేలో 1500 పాయింట్లకు పైగా  పతనమైన సెన్సెక్స్‌ చివరికి 1448 పాయింట్లు నష్టంతో 38297 వద్ద, నిఫ్టీ 432 పాయింట్లు కుప్పకూలి 11201 వద్ద ముగిసింది. నిఫ్టీ మెటల్, మీడియా, ఐటీ, ఐటి,  బ్యాంకింగ్‌, రియాల్టీ, ఫార్మా ఇలా  అన్ని రంగాలు కుదేలయ్యాయి. నిఫ్టీ 50లో  ఒకటి తప్ప మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిసాయి.  వేదాంత, టాటా మోటార్స్, టాటా స్టీల్, యెస్ బ్యాంక్, హిండాల్కో,  ఇన్ఫోసిస్  భారీగా నష్టపోగా, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌, టాటా స్టీల్‌, యెస్ బ్యాంక్, ఐఆర్‌సీటీసీ,ఎస్‌బీఐ, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, ఐటీసీ నష్టపోగా ఐవోసీ ఒక్కటే లాభపడిన షేరు. అటు డాలరుమారకంలో రూపాయి ఆరు నెలల కనిష్టానికి చేరింది. 

చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ