ఈ రెండ్రోజులూ.. రెండు యుగాలు!!

Published on Wed, 11/09/2016 - 01:40

కేంద్ర ఆకస్మిక నిర్ణయంతో సామాన్యుల ఇక్కట్లు
ప్రయాణాల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం 
తాత్కాలికమే అరుునా... గందరగోళం, అయోమయం
చేతిలో డబ్బులున్నా తిండి దొరికే పరిస్థితి లేదు 
చిల్లర లేక నిలిచిపోతున్న ‘ఎమర్జెన్సీ’ చెల్లింపులు
ఆర్థిక వ్యవస్థపైనా తాత్కాలికంగా తీవ్ర ప్రభావం 
ఆభరణాలు, వాహన పరిశ్రమపై ప్రతికూలత
స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ప్రతికూలంగా స్పందించే అవకాశం

సాక్షి, బిజినెస్ విభాగం
మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ కరెన్సీ నోట్లపై ప్రకటన చేసేనాటికి కొన్ని లక్షల మంది ప్రయాణాల్లో ఉన్నారు. వారిలో చాలా మంది దగ్గర పెద్ద నోట్లే ఉన్నారుు. ప్రధాని ప్రకటన వెలువడ్డాక తమ వద్దకు వచ్చిన జాతీయ టీవీ ఛానెళ్ల ప్రతినిధులను వారంతా అడిగిన ప్రశ్న ఒక్కటే!ఈ రెండ్రోజులూ మేమేం చెయ్యాలి? మా దగ్గరున్న డబ్బులతో తిండి తినటానికి కూడా లేదు. ఏం చెయ్యాలి? అని!! నిజం... ఈ ప్రశ్నకు ఆ చానెళ్ల ప్రతినిధుల వద్దే కాదు. వారు సంప్రతిస్తున్న ఆర్థిక నిపుణుల వద్ద కూడా సమాధానం లేదు. వీరే కాదు!! ప్రస్తుతం దేశంలో పర్యటిస్తున్న విదేశీయుల పరిస్థితీ అంతే!!

 ప్రయాణాల్లో చిక్కుకున్న వారే కాదు. ఇళ్లలో ఉన్నవారు కూడా ఆసుపత్రులు, మందులు, పాలు, పెట్రోలు, రైలు టిక్కెట్ల వంటి అత్యవసరాలకు తమ దగ్గరున్న రూ.500, రూ.1000 నోట్లను చెల్లించగలరేమో కానీ... రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, పచారీ దుకాణాల వంటివాటిలో మాత్రం చెల్లించలేరు. మరి శుక్రవారం ఉదయం వరకూ వీరి పరిస్థితేంటి? బిగ్‌బజార్ వంటి సంస్థలు పరిస్థితిని ‘క్యాష్’ చేసుకునేందుకు రాత్రి 12 గంటలవరకూ తెరిచి ఉంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ సమాచారం అంది... అప్పటిలోగా అక్కడకు వెళ్లి సరుకులు కొనగలిగేదెందరన్నది పెద్ద ప్రశ్నే.

 ఇదే ఆలోచనతో కొందరు ఏటీఎంలకు వెళ్లారు. అక్కడ భారీ లైన్లు తప్ప అందులో రూ.100 నోట్లు లేవు. కొందరు కాస్త తెలివితేటలు ప్రదర్శించి... రూ.1000 నోటు ఇచ్చి రూ.200 పెట్రోలు పోరుుంచుకుందామని చూశారు. అలాగైనా చిల్లర చేతికొస్తుంది కదా అని భావించారు. కానీ ఆ బంకు యజమాని అప్పటికే కొందరికి చిల్లర ఇచ్చాడు. ఇక తన దగ్గర లేదని చేతులెత్తేశాడు. నిజానికి పెట్రోలు బంకులే కాదు!!. చిల్లర కోసమని వచ్చే రెండు రోజులూ మందుల దుకాణాలు, పాల షాపులు... ఇలా ఎక్కడికి వెళ్లినా అక్కడ చిల్లర సమస్యే ఎదురయ్యే ప్రమాదం ఉంది. నోట్లను తీసుకోబోమని వారు చెప్పరు. కానీ చిల్లర లేదంటేఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

 ఇవన్నీ చిన్నచిన్న ఇబ్బందుల్లా కనిపించవచ్చు. కానీ రెండ్రోజులే అరుునా... ఆహారమనేది జీవన్మరణ సమస్య. బహుశా... పెద్ద నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడతాయని స్వయానా ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చేసిన ప్రకటన ఈ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు. ఈ హఠాత్ చర్య సామాన్య పౌరులకే కాదు...దేశ ఆర్థిక వ్యవస్థకూ కొద్దిరోజులపాటు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందనేది పలువురు విశ్లేషకుల మాట. నల్లధనాన్ని కట్టడిచేసే దిశగా తీసుకొన్న ఈ చర్య హర్షించదగ్గదే అరుునప్పటికీ, ఇలా.. తక్షణ నోట్ల రద్దు, ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించడం వంటివాటితో  పలు వ్యాపార లావాదేవీలు స్తంభించిపోరుు, దేశంలో ముఖ్యమైన వినియోగవ్యవస్థ కుంటుబడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

 జీడీపీ వృద్ధి తగ్గొచ్చు!
పన్నుల యంత్రాంగానికి లెక్కచెప్పని డబ్బు చాలావరకూ వినియోగంపై వ్యయమవుతూ వుంటుంది. ఈ వినియోగ వ్యయానికి కొద్ది రోజులపాటు కోత పడుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలు కుదేలైపోతాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.  రిటైల్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు తదితరాలే కాదు.. టూ వీలర్లు, ఆభరణాల దుకాణాలు వంటివీ వెలవెలపోతాయని హెచ్చరిస్తున్నారు. దాంతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వద్ధి తగ్గే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు.

భారత్ జీడీపీ విలువ రూ.130 లక్షల కోట్లు. దీనికి రియల్టీ నుంచి వస్తున్నది 11%.
2015లో దేశంలో నగదు లావాదేవీలు రూ.88 లక్షల కోట్లు. కార్డు ద్వారా, ఆన్‌లైన్లో జరిగిన చెల్లింపులు రూ.92లక్షల కోట్లు.

24 గంటల పాటు సేవలు
కొత్త నోట్లతో ఏటీఎంలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం. అత్యవసరాలకు ప్రభుత్వం తగిన మినహారుుంపులు కల్పిం చింది. కస్టమర్లు వారి వద్దనున్న నోట్లను మార్చుకునేందుకు 24 గంటల పాటు సేవలు అందిస్తాం. గతంలో ఇటువంటి ఘటనలను బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొన్నది. ఇప్పుడు మరోసారి నిర్వహించనున్నాం. బ్యాంకులు, ఏటీఎంలలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను వెనక్కి తీసుకునేందుకు బుధవారం బ్యాంకు శాఖలను మూసివేస్తున్నాం. - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్

 అక్రమ చెల్లింపులకు చెక్..
సమాంతర ఆర్థిక వ్యవస్థ (నల్లధనం)కు చెక్ పెట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న ప్రభావవంతమైన చర్య ఇదే. అన్ని రకాల సక్రమ నగదు చెల్లింపులను ఇది ప్రోత్సహిస్తుంది. దీంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది.

- చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్

 రియల్టీపై ప్రభావం
ఇది అతిపెద్ద సంస్కరణ చర్య. ఎవరూ ఊహించనిది. పెద్ద ఎత్తున ధనాన్ని కలిగి ఉండి దాన్ని పన్ను లెక్కల్లో చూపని వారిపై గణనీయ ప్రభావం చూపుతుంది. రియల్టీ రంగంలో ఎక్కువ శాతం లావాదేవీలు నగదు ఆధారితంగానే జరుగుతున్నారుు కనుక ఆ రంగంపై ప్రభావం ఉండవచ్చు. నిర్మాణ రంగ కార్యకలాపాలు మందగించవచ్చు. అరుుతే, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలంలో ఈ నొప్పి భరించతగినదే.  - దీపక్ పరేఖ్, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్

మన స్టాక్ మార్కెట్ డైలమా!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే బుధవారంనాటికి తగిన విధంగా ప్రిపేర్ అరుువున్న స్టాక్ మార్కెట్‌కు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం షాకేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో హిల్లరీ గెల్చినా, ట్రంప్ గెల్చినా ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోలకు ఎక్కువ నష్టం జరక్కుండా కొద్దిరోజుల నుంచి జాగ్రత్త పడుతున్నారు. కొన్ని షేర్లు అమ్మివేయడం లేదా మరికొన్ని రంగాలవి కొనుగోలు చేయడం వంటి జాగ్రత్తలతో పాటు బుధవారం ఫలితం వెలువడగానే ఏర్పడే తీవ్ర హెచ్చుతగ్గులకు తగిన హెడ్జింగ్‌నూ ఇన్వెస్టర్లు చేసుకున్నారని, కానీ నోట్ల రద్దు హఠాత్ చర్యతో ఈ షాక్‌ను మార్కెట్ భరించాల్సివుంటుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

 ఎస్‌జీఎక్స్ నిఫ్టీ డౌన్...: ఎన్నికల్లో హిల్లరీ విజయం సాధిస్తుందన్న అంచనాలతో మంగళవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు పెరుగుదలతో ట్రేడవుతున్నప్పటికీ, ఎస్‌జీఎక్స్ నిఫ్టీ మాత్రం 70 పారుుంట్ల నష్టంతో 8,480 పారుుంట్ల వద్ద కదులుతోంది. మన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి అనుసంధానమైన ఈ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సింగపూర్, అమెరికా మార్కెట్లలో ట్రేడవుతుంది. అలాగే అమెరికాలో లిస్టరుున ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ 4 శాతం పతనంకాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడీఆర్ 1 శాతం నష్టంతో వుంది. ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్‌లు కూడా నష్టపోగా, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ఏడీఆర్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నారుు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ