వడ్డీరేటు తగ్గించిన ఈపీఎఫ్‌ఓ

Published on Wed, 02/21/2018 - 19:56

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ వడ్డీరేటును తగ్గించింది. ఈ ఏడాదికి 8.55 శాతం మాత్రమే వడ్డీరేటును ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే గతేడాది కంటే ఈ రేటు 10 బేసిస్‌ పాయింట్లు తక్కువ. గతేడాది ఈ వడ్డీరేటు 8.65 శాతంగా ఉండేది. 2015-16లో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. వరుసగా మూడు సార్లు నుంచి ఈపీఎఫ్‌ఓ ఇలా వడ్డీరేటుకు కోత పెడుతూ వస్తోంది. బుధవారం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ట్రస్టీలతో సమావేశమైన అనంతరం ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌ఓలో దాదాపు 5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. 

ఈపీఎఫ్‌ఓ ఈ వడ్డీరేటును నిర్ణయించిన అనంతరం, ఆర్థికమంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరిలో సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో ఏడాది వడ్డీ క్రెడిట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌ లేదా యాప్స్‌ ద్వారా సబ్‌స్క్రైబర్లు తమ బ్యాలెన్స్‌ను చెక్‌చేసుకోవాల్సి ఉంటుంది. 2015 ఆగస్టు నుంచి ఈటీఎఫ్‌ఎస్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ