టాటాలో సంచలనం: భారీగా ఉద్యోగాల కోత

Published on Fri, 06/23/2017 - 08:41

టాటా మోటార్స్ లో భారీ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్ నిర్మాణ ప్రక్రియను టాటా మోటార్స్ చేపట్టింది. ఈ పునర్ నిర్మాణ చర్యలతో దాదాపు 1200-1300 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. అంతేకాక వేరే యూనిట్లకు తరలి వెళ్లాలని లేదంటే కంపెనీ విడిచిపెట్టాలని ఉద్యోగులకు నిర్మోహమాటంగా టాటా మోటార్స్ యాజమాన్యం చెప్పేస్తోంది. ఇప్పటికే 2500 పొజిషన్లను కంపెనీ తీసివేసింది.
 
కంపెనీ తొలగించిన వీరిలో ఎక్కువగా కిందిస్థాయి వారే ఉన్నారని తెలిసింది. టాటా మోటార్స్ లో ఈ పునర్ నిర్మాణ చర్యలు చేపట్టకపోతే, ఉద్యోగుల ఖర్చులు రూ.400-రూ.500 కోట్లు పెరిగే అవకాశముందని కంపెనీ హ్యుమన్ రిసోర్సస్ హెడ్ గజేంద్ర చందెల్ అన్నారు.  ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ఎక్కువని, ఈ ఏడాది బడ్జెట్ రూపొందించేటప్పుడే కొత్త రూపురేఖలను సిద్ధంచేశామని, దీంతో రూ.400 కోట్లను తగ్గించుకోవచ్చని అంచనావేసినట్టు చెప్పారు. 
 
సంస్థలో వైట్ కాలర్ పాపులేషన్ ఆందోళన కలిగిస్తోందని, 1500 మంది మేనేజింగ్ డైరెక్టర్లను తొలగించే యోచనలో ఉన్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యుయెంటర్ బచక్ అంతకముందే పేర్కొన్నారు. గత 18 నెలల్లో టాటా మోటార్స్ లో 2500 వైట్-కాలర్ పొజిషన్లు ఖాళీ అయ్యాయని, ఇవి పొదుపుకు సహకరిస్తున్నాయని కంపెనీ చెప్పింది. వచ్చే రెండు-మూడేళ్లలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా 3000 వరకు తగ్గిపోయే అవకాశముంది.
 
ప్రస్తుతం కంపెనీలో 30వేల మంది బ్లూ-కాలర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 10 శాతం తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమ ప్లాంట్ల ఉత్పత్తిని మెరుగుపరచడానికి కంపెనీ 10 శాతం వేతనాన్ని పనితీరు ఆధారితానికి లింక్ చేసింది. అయితే టాటా మోటార్స్ వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి నష్టాలనే నమోదుచేస్తోంది. బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీతో 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.2,480 కోట్ల నష్టాలను కంపెనీ మూటగట్టుకుంది.   

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)