విశాఖలో బస్సు దగ్ధం

Published on Sun, 01/05/2020 - 20:01

విశాఖపట్నం: గాజువాక పోర్టు రోడ్డు పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న లారీ మెకానిక్‌​ గ్యారేజ్‌లో  పెనుప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మత్తుల కోసం వచ్చి గ్యారేజ్‌లో ఉన్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో గ్యారేజ్‌లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ