మార్కెట్‌ పీఎస్‌లో జగ్గారెడ్డి హాజరు

Published on Mon, 10/01/2018 - 09:06

సనత్‌నగర్‌: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టై షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మార్కెట్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. 2004లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇతరులను తన భార్య, పిల్లల పేరుతో అమెరికా పంపినట్లు వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్‌ 9న అతడిని అదుపులోకి తీసుకున్న మార్కెట్‌ పోలీసులు 10న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ కేసు దర్యాపు కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ మార్కెట్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జగ్గారెడ్డిని విచారించి తిరిగి కోర్టులో హాజరుపరచడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. సెప్టెంబర్‌ 25న సికింద్రాబాద్‌ 22వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన ఎస్‌ఐ అంజయ్య ఎదుట రిజిస్టర్‌లో సంతకం చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ