amp pages | Sakshi

‘లాడెన్‌’ను చంపటానికి అనుమతించండి!

Published on Sun, 06/10/2018 - 13:35

అస్సాం : అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు కావొస్తుంది.. అయినా చనిపోయిన లాడెన్‌ను చంపాలనుకోవడమేంటని అనుకుంటున్నారా? ఇక్కడ లాడెన్‌ అన్నది ఓ మగ ఏనుగు పేరు. దాని రూపం, ఎత్తు చూసి అసోంలోని గోల్‌పరా అటవీ ప్రాంత ప్రజలు దానికి ఆ పేరు పెట్టారు. అడవి చుట్టు పక్కల నివసిస్తున్న ప్రజలకు లాడెన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 37 మందిని చంపినట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మదపుటేనుగుగా మారిన లాడెన్‌ను చంపి దాని బారి నుంచి ప్రజల్ని రక్షించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులను అనుమతి కోరారు. 

వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని గోల్‌పరా అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రజలపై లాడెన్‌ దాడి చేసి చంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 1న పట్‌పారా పహర్‌టోలి గ్రామానికి చెందిన మనోజ్‌ హజోంగ్‌ అనే వ్యక్తి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అడ్డువచ్చిన అతన్ని తొక్కి చంపేసింది. అటవీ సంరక్షణాధికారులు మాట్లాడుతూ..  లాడెన్‌ గోల్‌పరా అడవుల్లో అడుగుపెట్టిన తర్వాత దాదాపు 37 మందిని చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కువగా సాయంత్రం, రాత్రి సమయాల్లో దాడి చేస్తోందన్నారు. ఏనుగుల గుంపును చూసిన వెంటనే గిరిజనులు వాటిని తరమటానికి చేసే ప్రయత్నం వల్ల ఒక్కో సారి ఏనుగులు దాడికి తిరగబడే అవకాశం ఉందన్నారు.

ఒంటరిగా ఉన్న ఏనుగులు చాలా ప్రమాదకరమని తెలిపారు. దాడి జరిగిన ప్రతిసారి 10-15 రోజులు ఆ ఏనుగు కనిపించకుండా పోతోందన్నారు. చాలా దాడులు నెలలోని చివరి రోజుల్లో జరిగాయన్నారు. లాడెన్‌ను మదపుటేనుగుగా గుర్తించి చంపటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. 2006లో సోనిత్‌పుర్‌ జిల్లాలోని లాడెన్‌ అనే ఓ ఏనుగును మదపుటేనుగా గుర్తించి చంపటం జరిగిందన్నారు. గిరిజనులు రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు సూచించారు.  

Videos

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)