amp pages | Sakshi

అమ్మా.. లేమ్మా!

Published on Sat, 09/15/2018 - 06:45

రాత్రి అందరిలానే నిద్రపోయిన ఆ తల్లి ఇకలేవలేదు.. తెల్లారేసరికి కిటికీ ఊచలకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. రాత్రి ఇంట్లోనే ఉన్న తండ్రి అయిపూఅజా లేకుండా పోయాడు.. అభం శుభం తెలియని ఆ పిల్లలు తల్లిలో చలనం లేక, తండ్రి కనిపించక తల్లడిల్లిపోయారు.. ఆరిలోవ రవీంద్రనగర్‌లో జరిగిన గృహిణి అనుమానాస్పద మృతి ఘటన.. పిల్లల ఆక్రందన స్థానికులను కలచివేసింది.

ఆరిలోవ(విశాఖ తూర్పు): తెల్లారక ముందే టిఫిన్‌ తయారు చేసి బలవంతంగా నిద్ర లేపే అమ్మ.. ఈ రోజు ఎంత లేపినా ఎందుకు లేవడం లేదో ఆ చిన్నారులకు తెలియడం లేదు. వద్దు వద్దు అంటున్నా వెంట పడి తినిపించే తల్లి ఆకలేస్తోందని ఎంత ఏడుస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. చిన్న అరుపు వినిపిస్తే ఏమైందోనని కంగారు పడి పరుగెత్తే అమ్మ గుక్కపట్టి ఏడుస్తున్నా పక్కకు కదలడం లేదు.. ఏమైందో చెప్పడానికి నాన్న కూడా కనపడకుండా పోయాడు.. మాటలైనా రాని ఆ పసివాళ్ల హృదయ ఘోష చుట్టూ ఉన్న వారి మనసును కలిచివేసింది..

ఓ గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులకు తెలియజేసి పరారైన మృతురాలి భర్త తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి దరి పెంటలింగాపురానికి చెందిన బమ్మడిపాటి గోపీకృష్ణ కిరణ్‌కుమార్‌కు, అదే జిల్లా గరివిడి దరి పెదబంటుపల్లికి చెందిన ఉమ(26)తో 2012లో వివాహమైంది. గోపీకృష్ణ నగరంలో ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న సాయి, లడ్డూ అనే మగపిల్లలున్నారు. వీరంతా కొన్నాళ్లుగా మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో చిన్నచిన్న గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుండేవని స్థానికులు చెప్పారు. అయితే ఈ గొడవలు పెద్దల వరకు చేరలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారేసరికి ఉమా చీరతో కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఆమె భర్త గోపీకృష్ణ వరసకు తోడల్లుడు అయ్యే బంధువుకు ‘ఉమా ఆత్మహత్య చేసుకొంది.. వెంటనే రావలెను’ అని సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ చేశారు. అనంతనం అక్కడే మృతదేహాన్ని, నిద్రపోతున్న చిన్నారులను వదిలేసి పరారయ్యాడు. తెల్లవారి లేచిన పిల్లలు తల్లిన లేపినా లేవకపోవడంతో ఆకలితో గోలపెట్టారు. ఇంతలో ఫోన్‌ మెసేజ్‌ ద్వారా నగరంలో అందుబాటులో ఉన్న వారి బంధువులు చేరుకుని ఆ చిన్నారులను చేరదీశారు.

అనంతరం విజయనగరం నుంచి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ రామచంద్రరావు, ఆరిలోవ సీఐ సీహెచ్‌.తిరుపతారావు, ఎస్‌ఐ పాపారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంధువుల అనుమతితో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

అల్లుడే చంపేసి ఉంటాడు..
తన కుమార్తె ఉమా(26)ను అల్లుడు గోపీకృ ష్ణ చంపేసి ఉంటాడని, అందుకే పిల్లల్ని సైతం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడని మృతురాలి తండ్రి ఎన్‌.సూర్యప్రకాష్‌ ఆరిలోవ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తగిన విధంగా కట్నకానుకులు ఇచ్చుకొన్నామ ని, అయినా కట్నం సరిపోక అదనంగా మరిం త కట్నం అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానా స్పద కేసుతో పాటు మృతురాలి భర్తపై 498ఏ కేసు నమోదు చేసినట్టు సీ.ఐ తిరుపతిరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Videos

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)