amp pages | Sakshi

యస్‌ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట

Published on Mon, 03/09/2020 - 17:33

సాక్షి,  ముంబై: యస్‌ బ్యాంకు సంక్షోభంతో ఆందోళనలో పడిన బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట కలగనుంది. నగదు ఉపసంహరణకు సంబంధించి ఇటీవల ఆర్‌బీఐ విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేయ నుంది. యస్‌బ్యాంకు ఖాతాదారులు  ఈ వారాంతానికే ఎలాంటి పరిమితి లేకుండా తమ నగదును విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు కలగనుంది. ఈ విత్‌డ్రాయల్‌ను మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాత ఎత్తివేసే అవకాశం ఉందని కొత్తగా నియమితులైన యస్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎస్‌బీఐమాజీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌  సోమవారం ప్రకటించారు. మొదట రూ.50,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం నెలరోజులు కాలపరిమితిగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం దానిని మార్చి 15వరకే పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ అకౌంట్లలోని నగదును ఎంతకావాలంటే అంత మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. యస్‌బ్యాంక్‌ కార్యకలాపాలను ఏప్రిల్‌ 3నాటికి పునరుద్దరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంకా యస్‌బ్యాంక్‌ను ఎస్‌బీఐలో విలీనం చేస్తారనే ఊహాగానాల్లో వాస్తవం లేదని, యస్‌ బ్యాంక్‌ స్వంతంత్రంగానే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మూలధనం సమకూర్చలేనప్పుడు మాత్రమే విలీనం అవసరమేర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరాలన్నింటిని మార్చి 14న వెల్లడిస్తామని తెలిపారు.

అటు యస్‌ బ్యాంకులో  49 శాతంవాటాల కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ  ఆమోదం తెలిపింది. తొలి దశలో భాగంగా ఎస్‌బీఐ రూ. 2450 కోట్లను యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం భారీ పతనంలో కూడా యస్‌ బ్యాంకు  షేర్ల  కొనుగోళ్లకు పెట్టుబడి దారులు ఆసక్తి  చూపారు.  దీంతో 32 శాతం ఎగిసిన యస్‌ బ్యాంకు  షేరు 21.35 వద్ద ముగిసింది. కాగా  యస్‌బ్యాంక్‌లో అక్రమాలు నేపథ్యంలో ఆర్‌బీఐ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకు లావాదేవీలపై నెల రోజుల పాటుమారటోరియం విధించింది. కేవలం రూ.50వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది. మరోవైపు యస్‌బ్యాంక్‌ పునరుద్ధరణకు ఆర్‌బీఐ సత‍్వర చర్యలు ప్రక్రియను వేగవంతం చేసింది.

చదవండి:  యస్‌ బ్యాంక్‌ రాణా కపూర్‌ అరెస్ట్‌!!

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)