amp pages | Sakshi

రైతన్నకు కలుపు కష్టాలు

Published on Sat, 08/13/2016 - 22:44

  • పంట పొలాల్లో పెరుగుతున్న గడ్డి
  • వేధిస్తున్న కూలీల కొరత
  • పెరిగిన పెట్టుబడుల
  • ఆందోళనలో అన్నదాత
  • కుంటాల : రైతన్నలకు సాగు  కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లలో వర్షాలు లేక వేసిన పంట నష్టపోతే,ఈ సారి అధిక వర్షాల కారణంగా పంట పొలాల్లో గడ్డి ఎక్కువగా పెరిగింది.గడ్డిని తొలగించడానికి కూలీలు దొరక్క పక్క రాష్ట్రాల నుంచి ప్రయాణ ఖర్చులు కట్టించి కూలీలను తీసుకువస్తున్నారు.పెట్టిన పెట్టుబడిలో సగం కూలీలకే ఖర్చుచేస్తే మేమెలా బ్రతికేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
    గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటదిగుబడి రాక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.గత ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు కురుస్తాయన్న ధీమాతో  రైతులు మ గశిర కార్తెకు ముందే  విత్తనాలు వేసినా సకాలంలో వర్షాలు లేక రెండుసార్లు విత్తనాలు వేసి నష్టపోయారు.ఈఏడు ఖరీఫ్‌ను నమ్ముకుని పంటలసాగు చేసిన రైతులకు మళ్లీ చేదు అనుభవమే ఎదురవుతోంది. 
     
     పెరుగుతున్న గడ్డి 
     
    మండలంలోని ఆయా గ్రామాల్లో ఈఖరీఫ్‌ సీజన్‌లో 3450 హెక్టార్లలో సోయా,1750 హెక్టార్లలో వరి,16280 హెక్టార్లలో పత్తి,420 హెక్టార్లలో కందులు,150 హెక్టార్లలో మినుములు,80హెక్టార్లలో పెసళ్లు,35 హెక్టార్లలో పసుపు పంటలను సాగుచేశారు.ఈసారి మ  గశిర కార్తెనుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి.మండలంలోని రైతులు పత్తితోపాటు సోయా పంటను ఈసారి అధికమొత్తంలో సాగుచేశారు.ఎడతెరిపిలేని వర్షాల వల్ల పంటలు తక్కువగా ఎదిగి గడ్డి ఏపుగా పెరిగింది.వర్షాలు కురుస్తుండడంతోపాటు గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల కలుపుతీయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
    వర్షాలు కురవని సమయంలో కలుపుతీద్దామన్నా కూలీల కొరత  
    రైతులను వేధిస్తోంది.గతేడాది కలుపుకు కూలీ ధర రూ.150 నుంచి 200 ఉంటే ప్రస్థుతం అదే కూలీకి రూ.250 నుంచి రూ.300 వరకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.కొందరు రైతులు ఇక్కడ కూలీలు దొరకక పోవడంతో మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువచ్చి  వారికి ప్రయాణ ఖర్చులతో పాటు కూలీలను చెల్లిస్తున్నారు.పంట పెట్టుబడిలో సగం ఖర్చు కూలీలకే అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అధికవర్షాలతో నష్టాలను  చవిచూడాల్సిన పరిస్థితి  వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
     
     

#

Tags

Videos

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)