ఏమిటీ కాలుష్యం?

Published on Fri, 04/22/2016 - 02:33

వ్యర్థాలు ఎక్కడేస్తున్నారు?
15 రోజుల్లో నివేదిక ఇవ్వండి
‘సాక్షి’ కథనాలే ఎజెండా
అంచనా పద్దుల కమిటీ సమీక్షలో పీసీబీపై సోలిపేట ఫైర్

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమపై పంజా విసురుతున్న కాలుష్య సమస్యపై రాష్ట్ర శాసనసభ అంచనా పద్దుల ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఫైర్ అయ్యారు. పటాన్‌చెరు, హత్నూర, చేగుంట పల్లెలను కాలుష్యం కబలిస్తోందని, జనం మీదికి విష వాయువులను, వ్యర్థ రసాయనాలను పల్లెలపైకి వదిలేస్తున్న కంపెనీల తీరుపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన తెలంగాణ రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్‌ను ఆదేశించారు. ఈపీటీఎల్‌కు తరలించి శుద్ధి  చేయాల్సిన రసాయన వ్యర్థాలను పాశమైలారం, రుద్రారం, చేగుంట, హత్నూర ప్రాంతాల్లోని పరిశ్రమల యాజమాన్యాలు అడ్డగోలుగా చెరువులు, కుంటల్లో వేస్తున్నారని ఆయన సీరియస్ అయ్యారు.

గురువారం రామలింగారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ శాసనసభ సమావేశ మందిరంలో అంచనా పద్దుల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. పటాన్‌చెరు కాలుష్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన నేపధ్యంలో రామలింగారెడ్డి.. కాలుష్యాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్లు తెలిసింది. పరిశ్రమల నుంచి  రోజుకు ఎంత రసాయనిక వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటినేం చేస్తున్నారు? ఈపీటీఎల్‌లో (రసాయనిక వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్) ఎన్ని వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న పీసీబీ నివేదికలకు వాస్తవాంశాలకు పొంతన ఉందా? అంటూ ఆయన పీసీబీ అధికారులను నిలదీసినట్టు తెలిసింది. పాశమైలారంలో రాత్రి 10 తరువాత ఫార్మా కంపెనీలు పొగను వదిలేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కాలుష్యంపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌ను ఆదేశించినట్లు తెలిసింది.

Videos

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)